కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను నిలదీస్తాం : కిషన్‌రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు ఆయన నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని ఈ అఖిలపక్షంలో నిలదీస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు.