కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపకపోతే సి.పి.ఎం పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం.
కోటగిరి సెప్టెంబర్ 24 జనం సాక్షి:-కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఆపకపోతే దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.సీపీఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపాలని, పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్,నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ,శనివారం కోటగిరి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ,అధిక ధరలను అదుపు చేసి,పేద ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీపీఎం కోటగిరి మండల కార్యదర్శి మహమ్మద్ ఖాన్,రమేష్, తార్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు