కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలు. కొప్పుల మహేష్ రెడ్డి.
దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ మండల కేంద్రంలో కెటిఆర్ ఆదేశాల మేరకు
పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలకు నిత్య అవసరాలపై జిఏస్టి విదించడం సమంజసం కాదని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. రద్దు చేయని యెడల పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చెపట్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దోమ జడ్పిటిసి నాగిరెడ్డి గారు, మరియు దోమ పిఎసిఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు దోమ ఎంపీపీ అనసూయమ్మ గారు వైస్ ఎంపీపీ గురుమిట్కల్ మల్లేశం గారు దోమ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ గౌడ్ దోమ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజి రెడ్డి గారు, మండల టి. ఆర్. ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.




