కేజీ నుండి పీజీ వరకు జిల్లాలో విద్యా సంస్థల బంద్ సక్సెస్

రాజస్థాన్ రాష్ట్రంలోని జల్లూరు జిల్లా సూరానా గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిది సంవత్సరాల దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వాల్ దాహం వేస్తుందని స్కూల్లో ఉన్న కుండలో బుక్కెడు నీళ్లను త్రాగడని విద్యార్థిని చావగొట్టిన ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గౌరవ.శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ సక్సెస్ అయ్యింది అనంతరం MRPS నల్లగొండ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్యాల్ ను మంచి నీళ్ళు తగినందుకు విపరీతంగా కొట్టిన అగ్రకులానికి చెందిన ఉపాధ్యాయుడుని నడి రోడ్డుపై ఉరి తీయాలని అఖిలపక్షాల సంఘాల తరుపున డిమాండ్ చేస్తున్నాం దళిత విద్యార్థి పై జరిగిన హత్యపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడం సరైంది కాదు దళిత విద్యార్ధి పై జరిగిన హత్య సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారణకు ఆదేశించి దేశంలో దళితులపై జరుగుతున్న హత్య హత్యాచారం పై ప్రత్యేక చట్టం తీసుకరావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు చేపట్టిన బంద్ కు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రవేటు విద్య సంస్థల యాజమాన్యాలు సహకరించినందుకు MRPS నల్లగొండ జిల్లా పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో MRPS నల్లగొండ జిల్లా కో-కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ MSP నియోజకవర్గ ఇంచార్జీ బకరం శ్రీనివాస్ మాదిగ KVPS జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున BC విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గౌడ్ MSP మండల ఇంచార్జీ బొజ్జ దేవయ్య మాదిగ VHPS జిల్లా అధ్యక్షుడు కొత్త వెంకన్న VHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ VHPS జిల్లా అధికార ప్రతినిధి జెలెందర్ ఎమ్మార్పీఎస్ నాయకులు బండారు రమేష్ మండ్ర ఈదయ్య బోజ నవీన్ బిపంగి అర్జున్ తదితరులు పాల్గొన్నారు…