కేయూలో వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థుల ఆందోళన
వరంగల్ : తెలంగాణకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోకి పోలీసుల ప్రవేశం, విద్యార్థుల అరెస్టులను వ్యతిరేకిస్తూ పెట్రోలు సీసాలను చేతిలో పట్టుకొని నిరసనకు దిగారు. తెలంగాణవాదులను అణచివేసే చర్యలను మానుకోవాలని నినాదాలు చేశారు.