కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి
-గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి
జహీరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పేర్కొన్నారు.సోమవారం జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి, హుగ్గెల్లి తండా, రాయిపల్లి, శేకపుర్, హోతి (బి) గ్రామలలో 1.20 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్నితీసుకువచ్చారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలోని 138 గ్రామాలకు 20 లక్షల చొప్పున 27.60 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మాణిక్ రావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జహీరాబాద్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు శెట్టిరాథోడ్ ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు, సర్పంచులు రాజు, సుక్కమ్మ, ఉప సర్పంచుల ఫోరమ్ అద్యక్షులు నారాయణ, ఎస్టీ సెల్ మండల అద్యక్షులు హిరు రాథోడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ అద్యక్షులు తాజుద్దీన్, నాయకులు మచ్చేందర్, గోవర్ధన్‌రెడ్డి, అమిత్, శెట్టి రాథోడ్, పర్వేజ్, వహీద్, మోహన్ రెడ్డి, ఇజ్రాయేల్ బాబీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.