కేసీఆర్ లేని ఇంటికి నోటీస్ ఎలా అంటిస్తారు?


` పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం?
` తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా!
` ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆరఎస్ నేత కేటీఆర్
` నోటీసుల పేరుతో వేధింపులపై ఆగ్రహం
` నేడు తెలంగాణలో నిరసనలకు పిలుపు
హైదరాబాద్(జనంసాక్షి):మాజీ ముఖ్యమంత్రి, బీఆరఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసును నందినగర్‌లోని ఆయన నివాసం గోడకు అతికించడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ’ఎక్స’ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ విÖద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటి? కేసీఆర్ స్వయంగా తానుంటున్న నివాసం చిరునామాతో పోలీసులకు సమాధానం ఇచ్చిన తర్వాత కూడా.. ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గోడకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి! 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దే విచారించాలన్న నిబంధనను కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విÖద అవగాహన ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. లేదా ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మల్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తామని.. ప్రతి తప్ప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని తెలిపారు. బీఆరఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ అధికారులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి.. పైశాచిక ఆనందం పొందడం దారుణం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఇది కేవలం ’పైశాచిక ఆనందం’ పొందడమేనని కేటీఆర్ విమర్శించారు. చట్టం, న్యాయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి చేస్తోన్న ప్రతి తప్ప్పుడు పనిని ప్రజల ముందు పెడతామని, సమయం వచ్చినప్ప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
నేడు తెలంగాణలో నిరసనలకు కెటిఆర్ పిలుపు
సిట్ విచారణ పేరుతో ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌ను వేధిస్తున్నందుకు నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీఆరఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నేతలు నిరసన ప్రదర్శనలు చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రమంతటా శాంతియుతంగా ఆందోళనలకు దిగాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12 వేలకుపైగా గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని సూచించారు. నిరసనల్లో భాగంగా ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆరఎస్ శ్రేణులు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నాయి. నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయనున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నిరసనలు శాంతియుతంగా చేయాలని, పోలీసులతో ఘర్షణలు వద్దని సూచించారు.