కొండాయి గ్రామ ప్రజలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లను అందచేసిన జిల్లా కలెక్టర్.. ఇలా త్రిపాటి

ఏటూరునాగారం(జనంసాక్షి)ఆగస్టు07.
సోమవారం ఐటీడీఏ గిరిజన భవన్ ఏటూరు నాగారం లో
భారీ వర్షాల కారణంగా వరదలలో కొట్టుకుపోయిన కొండాయి
గ్రామ ప్రజల ఉంటున్న పునరావవాస కేంద్రం లోనే మీసేవ, ఆధార్ సెంటర్ లను ఏర్పాటు చేయించి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలలో కొట్టుకుపోయిన మీ అందరికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఈరోజు అందరికీ అందజేయుటకు 3 ఆధార్ బయోమెట్రిక్,
5 మీసేవ టేబుల్ తో అప్రేటర్లను ఏర్పాటు చేశామని, బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఇతర సర్టిఫికెట్లు కూడా త్వరలో డూప్లికేట్ ఇప్పించుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఎవరు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అండగా ఉందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఓ వసంతరావు, డి డి పోచం, డి టి డి ఓ దేశిరం, తాహాసిల్దార్ వీరాస్వామి, ఎంపీ డి ఓ కుమార్, కొండాయి సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు, ఈ డిఎం దేవేందర్, మీసేవ కోఆర్డినేటర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు