కొనసాగుతున్న భూతల ద్రోణి! రాష్ట్రవ్యాప్తంగా కురుసున్న వర్షాలు

విశాఖపట్నం, హైదరాబాద్‌, జూలై 26 : బంగాళాఖాతంలో ఏర్పడిన భూతక ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలోల వర్షాలు పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. అప్పడీన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించడంతో పాలాల్లో బావుల్లో నీరు చేరింది. ఈసీజన్‌లో వేసవి పత్తి వేరుశనగ, కూరగాయల పంటలను రైతులు చేయడానికి ఈ వర్షాలతో ఊరట లభించింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతులు తమ పోలాల్లో దక్కులు దున్నేందుకు సమయాత్తమవుతున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు లేక కోస్తాతీర ప్రాంతంలో సాగు చేసిన వేరుశనగ రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రస్తుతం కురిసన వర్షం వేరుశనగ పంటకు ఎంతగానో మేలు చేసింది. ప్రధానంగా ఆగస్టు నెలలో కంది, పత్తి, ఆముదం, మిర్చి పంటలను ఈ ప్రాంత రైతులు సాగు చేస్తారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ రైతుల్లో ఆనందం నెలకొంది. ఇదిలా ఉండగా ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో 89.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావల్సి ఉండగా ఇప్పటివరకు 84.8 మిల్లిమీటర్ల వర్షపాం నమోదైంది. జిల్లాలో బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు 27.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా దర్శి మండలంలో 109.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా కొన్ని మండలాల్లో నెలసరి వర్షపాతం దాటి వర్షపాతం నమోదైంది. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌లోని రైతున్నల ఆశలు చిగురిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. గత ంండు రోజులుగా ఒక్క గుమ్మగట్ట మండలం మనహా జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా బుధవారం 22.6 విమీ, రాత్రి 25.5 మిమీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే జిల్లాలో 80 వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేశారు. వీటిలో 60 వేల హెక్టర్లలో వేరుశనగ, మిగిలిన 20 వేల హెక్టార్లలో ఆముదం, రాగి, కందులు, పెసర, జొన్న, సజ్జ, ఉలమలు లాంటి పంటులు సాగు చేశారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలో బుధవారం రాత్రి వర్షం కురిసింది. శిరివెళ్ల మండలంలో అత్యధికంగా 10.02 సెం మీ వర్షం కురిసింది.

తాజావార్తలు