కొనసాగుతున్న మైకేల్ విచారణ
న్యూఢిల్లీ,డిసెంబర్8(జనంసాక్షి):అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్ విచారణ కొనసాగుతోంది. మైకెల్ సన్నిహితులు ఆర్కే నందా, జెబి బాల సుబ్రమణ్యన్ ల నుంచి సేకరించిన డాక్యుమెంట్లు, స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తున్నారు సిబిఐ. ఆర్కే నందా గతంలో ఢిల్లీలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడని, అతడికి మైకేల్నుంచి దుబాయ్ బ్యాంకు అకౌంట్ల ద్వారా డబ్బు అందిందంటున్నారు సిబిఐ అధికారులు. మైకెల్ విచారణతో అగస్టాలో అసలు దోషులెవరో బయటపడతారని చెబుతున్నారు.