కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌
నుంచి విదర్భ మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి తెలంగాణ, రాయలసీమ వరకు కొనసాగుతోందని శాస్త్రవేత్తలు తెలపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల, కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా అంతట క్యూములో నింబస్‌ మేఘాలు ఆవరించి ఉన్నాయని తెలిపింది.