కొమురవెల్లికి తగ్గని భక్తుల రద్దీ
వరంగల్,మార్చి9(జనంసాక్షి): కొమురవెల్లి జాతర మొదలై రెండు నెలలు కావస్తున్నా జనసందడి తగ్గడం లేదు. ప్రతిరోజూ భక్తుల రాక పెరుగుతూనే ఉంది. ఆదివారాలు ఈ రద్దీ విపరీతంగా ఉంటోంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరలో ఇప్పటికి 50 రోజులు గడిచింది. అయినా భక్తుల రద్దీ వారం వారం పెరుగుతూ వస్తుంది. శనివారం సాయంత్రం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది. ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా స్వామివారిని ధూళి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని రాత్రి నిద్ర చేసి, ఆదివారం ఉదయం కోనేరులో పవిత్ర స్నానాలు చేసి బోనాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సోమవారం ఉదయం ధర్వనం తరవాత భక్తులు బయలుదేరుతున్నారు. స్వామివారి బ్ర¬్మత్సవాల(జాతర)లో భాగంగా ఎనిమిదో ఆదివారమూ భక్తుల పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు చర్యలు తీసుకున్నారు.