కోడెలపై లాఠీఛార్జీ అమానుషం

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌పై పోలీసులు లాఠీఛార్జీ అమానుషమని దాడి వీరభద్రరావు, కరణం బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు అరండల్‌పేట కూడళ్లలో తెదేపా కార్యకర్తల రాస్తారోకో కొనసాగుతొంది. ఈ ఆందోళనలో తెదేపా నేతలు దాడి వీరభద్రరావు, కరణం బలరాం, పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. న్యాయం అడిగిన కార్యకర్తలపై దాడులు చేయటం అన్యాయని తెదేపా నేతలు అన్నారు. డీఎస్పీకి రాజకీయాలపై ప్రేమ ఉంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలన్నారు. అరండల్‌ పేటలో రాస్తారోకో కారణంగా వాహనాలు నిలిచిపోయాయి.