కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బేషరతు గా క్షమాపణ చెప్పాలి

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– స్థానిక ప్రిన్స్ కార్నర్ జిట్టా మల్ల రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక సమావేశం లో కాంగ్రెస్ పార్టీ డీసీసి అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి గారు పాల్గున్ని నిన్న జరిగిన పత్రిక సమావేశం లో స్థానిక పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి గురించి అనిచిత వాక్యలో చేసిన
బీఆర్ఎస్ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మొట్టమొదటిసారిగా భువనగిరికి వచ్చి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటి వెంకటరెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరియు ఇన్ని రోజులు ఆయన ఉన్న కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది. దీనిని ఖండిస్తూ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి
కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తే ఇది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టే కాక పాత గజ్జలు అన్నట్టు పోటీ తత్వం లేకుండా టికెట్ రాదేమో అన్న అపోహతో ముందే కేసీఆర్ తో చేసుకున్న ఒప్పందంతో టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని మరియు క్యాడర్ని అయోమయంలో పడేసి తన దారి తను చూసుకున్నాడు తన స్వలాభం కోసం భువనగిరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిని నట్టేట ముంచేశాడు అయినా గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీలోని ఉన్నారు కాని కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారికి డబ్బు ప్రలోభ పెడుతూ పార్టీ మారాలని ఫోన్ కాల్స్ చేస్తున్నారు అయిన లాభం లేకపోయింది. ఈరోజు ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పై తన వల్లే తను పార్టీ వీడి వెళ్లిపోయానని కొన్ని బూటకపు మాటలు అనడం జరిగింది అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని విమర్శించే స్థాయి నీది కాదని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి హెచ్చరించారు.అంతేకాకుండ ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గా కూడా గెలువని అనిల్ కుమార్ రెడ్డి నీ రెండు సార్లు డీసీసీ పదవిని ఇచ్చి ఒక్కసారి ఎమ్మేల్యే టికెట్ ఇచ్చింది. ఆ కృతజ్ఞతలు లేని అనిల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఖబర్దార్ అనిల్ కుమార్ రెడ్డి ఇంకొకసారి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీనవర్గాల పార్టీ మేము అందరం ఏకమై ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. గర్వపసి కార్యక్రమం పైన కావాలంటే నువ్వు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అని అనిల్ కుమార్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో పంజలా రామాంజనేయులు గౌడ్. పీసీసీ ప్రధాన కార్యదర్శి పొత్నాక్ ప్రమోద్ కుమార్. బర్రె జహంగీర్. పట్టణ ఉప అధ్యక్షులు జిట్టా మల్లారెడ్డి.Sk మజర్ పాషా.గోదా శ్రీనివాస్. రాహుల్ గౌడ్. రఫీ.ఎలమ్మినేటి కృష్ణ రెడ్డి. కల్యా నాగరాజు.dn చారి తదితరులు పాల్గున్నారు