కోయపోచగుడా ఆదివాసి గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా
పట్టణంలో NTR చౌక్లో CPI ML ప్రజపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య ఆధ్వర్యంలోఈరోజు ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపుతో బాగంగా నిరసన కార్యక్రమన్నీ చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్యా మరియు ఆదివాసీ గిరిజన సంఘ నాయకుడు మాడవి అంకుష్ రావు గారులు మాట్లాడుతూ ఈరోజు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ గిరిజన పై దాడులను వెంటనే నిలిపివేయాలని కోయపోచంగూడెం ఆదివాసులపై రాక్షసంగా ప్రవర్తించారని మహిళలను చూడకుండా ఈడ్చికేల్లడం విపరీతంగా కొట్టడం హింసించడం దుర్మార్గమని 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులందరికి పట్టాలు ఇవ్వాలని అట్టి భూమిపై 2000 సంవత్సరం నుండి గిరిజనులు సాగులో ఉన్నారని మూడు లోనే కేసైన విషయాన్ని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా గమనించాలని సెంటు భూమిలేని అక్కడి గిరిజనులకు అటవీ భూమి జీవనాధారంగా ఉందని అటవీ భూమి పైన ఆదివాసులకే హక్కు ఉంటుందని విషయాన్ని ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా గుర్తించాలని గిరిజనులకు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం గత నవంబర్లో దరఖాస్తులు తీసుకొని మూలకు పడేశారని ఒకవైపు పట్టాలిస్తామని చెబుతూనే మరొకవైపు గిరిజనులు సాగులో ఉన్నటువంటి భూముల్ని గుంజుకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని ఆదివాసి చట్టాలను కూడా అమలు చెయ్యని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నదని ఇప్పటికైనా ప్రభుత్వం ఆదివాసుల పైన దాడులు ఆపి పోడు సాగుదారులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆదివాసి గిరిజనులపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..