కోలుకున్న మార్కెట్లు
ముంబయి: ఉదయం భారీగా నష్టపోయిన సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్‌రాజీనామా, ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో 500పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం సమయానికి కుదుటపడింది. నిఫ్టీ కూడా వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమై ఇప్పుడు స్వల్ప నష్టానికి చేరింది. ఒక దశలో సూచీలు స్వల్ప లాభాల్లో కూడా కదలాడాయి. మధ్యాహ్నం 12.30 సమయానికి సెన్సెక్స్ 31.21 పాయింట్ల నష్టంతో 34,929.51 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 4.65 పాయింట్ల స్వల్ప నష్టంతో 10483.80 పాయింట్ల వద్ద కదలాడుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.87 వద్ద కొనసాగుతోంది.