క్రీడలకు సర్కార్‌ ప్రోత్సాహం

తెలంగాణ హాకీ అకాడవిూని ప్రాంబించిన మంత్రి పద్మారావు

వనపర్తి,జూన్‌23(జ‌నం సాక్షి): క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. క్రీడా అకాడవిూల ఏర్పాటుతో పాటు, క్రీడాకారులకలు 2శాతం రిజర్వేషన్లు కల్పించిన విసయాన్ని గుర్తు చేశారు. జిల్లా కేంద్రంలో తొలి తెలంగాణ హాకీ అకాడవిూని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ నాలుగేల్లలో క్రీడాకారులకు అనేక విధాలుగా అండగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డితో పాలు పలువురు ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ అకాడవిూలో 24 మంది హాకీ ప్లేయర్లు శిక్షణ పొందనున్నారు. వనపర్తిలో హాకీ అకాడవిూని ప్రారంభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.