క్వారీ ప్రమాదంలో ఆపరేటర్ మృతి
క్వారీ ప్రమాదంలో ఆపరేటర్ మృతి
కొడకండ్ల మండలం రామవరం గ్రామ సమీపంలోని యుఎంఎన్ గ్రానైట్ క్వారీలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటుచు సుకుంది పొక్లయిన్ ఆపరేటర్ భానోత్ శ్రావణ్ (25) మృతిచెందాడు సిబ్బంది కధనం ప్రకారం 20 మీటర్ల లోతున్న గ్రానైట్ గుందలో పొక్లయిన్‌తో ఆపరేటర్ మట్టి, రాళ్ళు ఎత్తి క్రేయిన్ తొట్టిలోకి నింపే పనిచేస్తున్నారు తొట్టిలోకి రాళ్ళు నింపాక క్రేయిన్ ద్వారా దానిని పైకి లేపుతేన్న సందర్భంలో ఇనుపతాడు తెగటంతో గుంతలో కిందనున్న పొక్లెయిన్ పై పడింది ఈ ప్రమాదంతో పొక్లెయిన నుజ్జునుజ్జవటంతోపాటు ఆపరేటన్ శ్రావణ్ అక్కడికక్కడే మరణించాడు నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం శివారు బడితండకు చెందినశ్రావణ్‌కు భార్య ఏడుమాసాల బాబు ఉన్నాడు ప్రమాద సమాచారం అందుకొన్న కొడకండ ఎస్సై
కిషన్‌రావు పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకొన్నారు వ్రావణ్ కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద సంఖ్యలో క్వారీకి చేరుకుని యాజమాన్యంపై అగ్రహావేశాలు వ్యక్తం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది దేవరుప్పుల ఎస్సై హమీద్
మరికొంత మంది పోలీసులు వచ్చి పరిస్థితి చక్కదిద్దారు శ్రావణ్ కుటుంబానికి పరిహారం అందించాలంటూ గిరిజనులు డిమాండ్ చేయటంతో క్వారీ యాజమాన్యంతో ఒప్పందం అనంతరం శవాన్ని పంచనామా కోసం పంపారు.