క్షేత్రస్థాయిలో ముందస్తు చర్యలు

విలీన గ్రామాల్లో అభివృద్దికి చర్యలు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వరంగల్‌,మే3(జ‌నం సాక్షి): విలీన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కార్పొరేషన్‌ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్మారం శివారులో కిరాణ షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గొర్రెకుంటలో ప్రభుత్వం నూతనంగా కూరగాయల, పండ్ల మార్కెట్‌ను మంజూరు చేయడం సంతోషించదగిన విషయమన్నారు. ప్రభుత్వం రెండు రకాల మార్కెట్లను గీసుగొండ మండల పరిధిలో నిర్మిస్తుందన్నారు. మొగిలిచర్ల గ్రామాన్ని రూ. 2 కోట్లతో అభివద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్‌తో పాటు అంతర్గత రోడ్లు, సైడ్‌ డ్రైన్‌ లు, బతుకమ్మ ఆట స్థలంతో పాటు బస్‌షెల్టర్‌, శ్మశాన వాటికకు నిధులు మంజూరు చేస్తానని హావిూ ఇచ్చారు.సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఇదిలావుంటే  గీసుగొండ మండలంలోని విలీన గ్రామాలకు కార్పొరేషన్‌ నుంచి అధిక మొత్తంలో నిధులను కేటాయించినట్లు మేయర్‌ నన్నపునేని నరేందర్‌ తెలిపారు. మొగిలిచర్ల గ్రామం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉందన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మొగిలిచర్ల గ్రామానికి రూ.రెండుకోట్లతో పాటు అధనంగా నిధులను మంజూరు చేస్తానని ఆయన అన్నారు. వరంగల్‌ నగరానికి అతి సవిూపంలో పండ్లు, కూరగాయల మార్కెట్‌, కిరాణషాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రభుత్వం మంజూరు చేయడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు మేయర్‌ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశాలను జారీచేసినట్లు ఆయన తెలిపారు.