ఖమ్మంలో భాజపా నేతల అరెస్టు

ఖమ్మం సంక్షేమం: విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపును నిరసిస్తూ ధర్నా చేస్తున్న భాజపా సీనియర్‌ నేత దత్తాత్రేయ, జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డిలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు  చేశారు. అనంతరం నేతలను ఖమ్మం మొదటి పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.