ఖరీదైన సినిమా వీక్షణం

హైదరాబాద్‌, జనంసాక్షి: ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా వీక్షణం మరింత ఖరీదైపోయింది. సినిమా టికెట్‌ ధరలు 10నుంచి 20రూపాయలు మేర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమంయంలో ఐదు తరగతులుగా సినిమా హాళ్లను నిర్ధారించి ధరలను పెంచేందుకు అనుమతినిచ్చింది. ప్రేక్షకులకు సదుపాయాల కల్పనల్లో కూడా థియేటర్ల యాజమాన్యాలు మరింత శ్రద్ధ చూపాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. పన్నులేని నిర్వహణ చార్జీలు పరమితిని పెంచడం వల్ల థియేటర్‌ యాజమాన్యాలకు కూడా వెసులుబాటు కల్పించింది.