ఖావ్‌ పంచాయతీలు చట్టవిరుద్దం

న్యూఢిల్లీ: నేరాన్ని ప్రోత్సహించే తరహాలో ఉండే ఖావ్‌ పంచాయతీ ( గ్రామాల్లో కొందరు పెద్దమనుషులుగా స్థానికంగా జరిగే గొడవలను పరిష్కరించడం ) పలు చట్టవిరుద్దమని కోర్టు సహాయకుడు (అమికన్‌ క్యూరీ), సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇటువంటి చట్టవిరుద్దమైన పంచాయతీలను పోలీసులు అడ్డుకోవాలని రామచంద్రన్‌ కోర్టుకు సమర్పించిన తన నివేదికలో సూచించారు. ఖావ్‌ పంచాయతీలు నిర్వహిన్తుంటే నిర్వాహకులను అరెస్టు చేమాలన్నారు. ఇక్కడ ఇచ్చే ఆదేశాలకు ఎటువంటి చట్టబద్దతలేదని పేర్కోన్నారు. రామచంద్రన్‌ అభిప్రాయాలతో కేంద్రం ఏకీభవించింది. ఈ నివేదికపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే నాలుగు వారాల్లో తెలపాలని జస్టిస్‌ బీఎన్‌ చౌహాన్‌, జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రాలకు నాలుగు వారాల సమయం ఇచ్చింది.