గడీలలో గడ్డి మొలిపించిన వీర వనిత చాకలి ఐలమ్మకి ఘన నివాళి.
కోటగిరి సెప్టెంబర్ 10 జనం సాక్షి:-భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై వ్యతిరేకంగా పోరాడి గడీలలో గడ్డి మొలిపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కోటగిరి మండల రజక సంఘం అధ్యక్షులు ప్యాట్ల పెంటయ్య పేర్కొన్నారు.శనివారం రోజున కోటగిరి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చాకలి చిట్యాల ఐలమ్మ 37 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ భూస్వామీ దారుల పాలన విధానాలకు వ్యతిరేకంగా పోరాడి రైతుల పక్షపాతిగా విజయం సాధించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.రజాకార్ల,పట్వారిల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తన భర్తను, కొడుకును పోగొట్టుకున్న కానీ పట్టు విడవకుండా వారి దుర్మార్గాలను అణచివేసి నిలిచి మహనియురాలు చాకలి ఐలమ్మ అని అన్నారు. అటువంటి వీర వనిత యొక్క పోరాట స్మృతులను నేడు గుర్తుకు చేసుకొని కోటగిరి మండల వ్యాప్తంగా వారి వర్ధంతి సందర్భంగా ఘనంగా స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కోటగిరి సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దు,మండల రజక సంఘం ఉపాధ్యక్షుడు శీను,కార్యదర్శి హనుమండ్లు, బాలరాజు,బాలయ్య,మేతిసత్యనారాయణ, నారాయణ పాల్గొన్నారు.