గద్వాల రైల్వే స్టేషన్లో ఆజాద్ కి రైల్ గాడి ఔర్ స్టేషన్ ఉత్సవాలు

గద్వాల ప్రతినిధి ఆర్ సి (జనం సాక్షి) జూలై 19. గద్వాల రైల్వే స్టేషన్లో రంగు రంగుల లైటింగ్‌తో అలంకరణ చేశారు.గద్వాల్ రైల్వే జంక్షన్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంలో భారతీయ రైల్వే ఆజాదీ కి రైల్‌గాడి ఔర్ స్టేషన్ల వేడుకలను ఘనంగా నిర్వహిoచరు. ఈ వేడుకల కోసం దేశంలో 75 స్టేషన్లు గుర్తించగా అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గద్వాల, నాంపల్లి (హైదరాబాదు), విజయవాడ, గుంటూరు స్టేషన్లకు స్థానం లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు డివిజన్ వారు
శ్రీ శరత్ చంద్రయాన్ గారు తిరుపతి, వినయ్ కుమార్ సీ ఇ ఓ మరియు చైర్మన్
గద్వాల రైల్వే జంక్షన్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రైల్వే ప్రగతిని వివరిస్తూ, స్వతంత్ర సమరయోధుల కుటుంబసభ్యులను సన్మానం చేశారు. ఆజాది కా అమృత్ ఉత్సవాలు 18 నుంచి 23 వరకు జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా గద్వాల మరియు అలంపూర్ స్టేషన్ల లో రైల్వే శాఖ నుంచి పలు రైళ్లను ఆల్ట్ చేస్తామని , అభివృద్ధి పరంగా కృషి చేస్తానని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్న అమృత ఉత్సవాలను జోగులాంబ గద్వాల రైల్వే స్టేషన్లో జరిగిన ఉత్సవానికి ఎమ్మెల్సీ, ఎంపీ,ఎమ్మెల్యే లను ఎటువంటి సమాచారం లేదని అభిప్రాయపడ్డారు.వారితో పాటు స్వాతంత్ర సమరయోధులు దాదాపుగా గద్వాల పట్టణంలోని 50 మందికి పైగా ఉన్నప్పటికీ కేవలం నలుగురిని మాత్రమే సన్మాన కార్యక్రమం చేశారని మిగతా వాళ్లకు సమాచారం లేదని తెలిపారు వారిలో నారాయణ వరప్రసాద్ సుంకన్న వెంకట్రావు లను సన్మానించారు