గర్భిణీలు బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవాలి
మునిసిపల్ చైర్మన్ మురళి యాదవ్
నర్సాపూర్. ( జనం సాక్షి )
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ అన్నారు. శుక్రవారం నాడు నర్సాపూర్ పట్టణంలో జాతీయ పోషకాహార మాసోత్సవాలు లో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునిసిపల్ చైర్మన్ మురళి యాదవ్ హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం ఆహారం కల్తీ మయంగా మారిందని, సరైన ఆహారం లేక ఎంతో మంది రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పోషకాలతో కూడిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. నీళ్ళు, గాలి, వాతావరణం పూర్తిగా కలుషితమై పోయింది అని దాని వల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో పాల అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణీలు మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతారు ఆయన తెలిపారు.
కాగా అంగన్వాడి టీచర్ ల ను ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ గా ప్రభుత్వం గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో నేటికీ అంగన్వాడి కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు రాంచందర్, యాదగిరి ,సురేష్, సునీత బాల్ రెడ్డి, లత రమేష్ యాదవ్, సరిత అంజనేయులు గౌడ్, ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.