గాయకుడు మురళి ఆకస్మిక మృతి
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సాగర ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న గాయకుడు మురళీ గుండెపోటుతో మృతి చెందాడు, కాకినాడ రైల్వేస్టేషన్‌లో దిగిన అనంతరం ఆకస్మాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఖుషీ చిత్రంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే… పాటతో మురళి మంచి పేరు సంపాధించుకున్నాడు. అప్పటి నుంచి అతని పేరు ఖుషీ మురళిగా మారిపోయింది. ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో కొన్ని వందళ పాటలు పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. పోకిరీ, మిస్టర్ పర్‌ఫెక్ట్, గబ్బర్‌సింగ్ తదితర చిత్రాల్లో అతను పాడిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. మురళి ఆకస్మిక మృతితో ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు.