గిరిజన గ్రామాల్లో కరెంట్ వెలుగులు
చేయూతనిస్తున్న దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన
తక్కువ ఖర్చుకే విద్యుత్ సరఫరా
వరంగల్,జూలై9(జనం సాక్షి): అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తూ సూర్యోదయం తప్ప విద్యుత్ వెలుగులు చూడక … అరకొర వసతులతో జీవనం సాగించే… గిరి పుత్రుల జీవితాల్లో ప్రధాని చేపట్టిన దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన వెలుగులు ప్రసరింపజేస్తుంది…. అతి తక్కువ ఖర్చుతో వారికి విద్యుతు విూటర్ అందిస్తున్నది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామా జ్యోతి యోజన పధకం పై జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా సారలమ్మ స్వగ్రామం కన్నేపల్లి నుండి ప్రత్యేక కధనం.మరో కుంభమేళ గా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతరలో సారలమ్మ ఆవిర్భవించిన కన్నేపల్లి గ్రామం ఒక మారుమూల కుగ్రామం. మేడారం జాతరకు 5 కి విూ దూరం లో 250 కుటుంభాలు గల ఈ గ్రామం సరయిన అభివృద్దికి నోచుకోకపాయిన ఇక్కడ అమ్మను నమ్ముకుని జీవించే వారే ఎక్కువ… అలంటి వారి జీవితాలోకి ప్రతి ఇంటికి విద్యుధ్యుత్ ఉండాలనే ప్రధాని సంకల్పంతో ఏర్పడిన దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామా జ్యోతి పధకం వెలుగులు నింపుతుంది .తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒక మారుమూల ప్రాంతం. ఈ జిల్లలో ఎక్కువ శాతం గిరిజనులు జీవనం సాగించే అటవీ ప్రాంతం.. కేంద్ర ప్రభుత్వం మారుమూల జిల్లాల అభివుద్ది పధకం లో బాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు జిల్లాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఒకటి. అభివృద్దికి ఆమడ దూరంలో ఉండే ఈ జిల్లాను కేంద్ర అభివృద్ధి పధకంలో ఎంపిక చేయడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలు మౌలిక వసతుల ఏర్పాటులో పరుగులు తీస్తున్నాయి. ఈ జిల్లలో గ్రామా స్వరాజ్ యోజనలో భాగంగా 192 గ్రామాలూ ఎంపిక కాగ అక్కడ నివసించే వారికి కావలసిన వసతులను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్వరాజ్ యోజన ద్వారా ప్లలెలు మౌలిక వసతుల అభివృద్దిలో ముందడుగు వేస్తున్నాయి. కేంద్రం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామా జ్యోతి యోజన పధకం ద్వారా కేవలం 125 రూపాయలు చెల్లిస్తే సుమారు 3250 రూపాయల విలువ చేసే సర్వీసు వైర్ కట్ అవుట్ , కరెంట్ విూటర్, ఎల్‌ఈడి బల్బ్ అందిచడంతో పాటు వారి ఇంటి వరకు కరెంట్ పోల్ వేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వనుండడంతో ప్లలె ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.