గురుకుల దరఖాస్తు తేదీ పొడిగింపు
జనం సాక్షి , మంథని: గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశం కొరకు 2022-23 విద్యా సంవత్సరం దరఖాస్తులు ఈనెల 20 తేది వరకు పొడిగించడం జరిగిందని ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. శనివారం పాత్రికేయులకు తెలిపిన ప్రకటనలో కేజీ టు పీజీ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ నాణ్యమైన విద్యకు దూరమైన విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించడానికి, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి, ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు విద్యా శాఖల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం లో బోధనతో విజయవంతంగా నడుస్తున్న గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో ప్రవేశం కొరకు 2022 – 2023 విద్యా సంవత్సరమునకు అర్హులయిన విద్యార్థుల నుండి అప్లికేషన్లు కోరబడుచున్నవి. దరఖాస్తు చేయుట కొరకు చివరి తేదీని 20.03.2023 వరకు పొడిగించడం జరిగింది. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు తీసుకోవచ్చని అని తెలిపారు