గుర్రంపూడ్ మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

 తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి          కొండమల్లేపల్లి మార్చి 6 జనం సాక్షిన్యూస్ : గుర్రంపూడ్ మండల ప్రజానీకానికి, ప్రజాప్రతినిధులకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా  పాశం గోపాల్ రెడ్డి  మాట్లాడుతూ హోలీ’ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు ఈ పండుగ గురించి పురాణాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను వేస్తారు విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లు ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని దీని అర్థం ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు . రంగుల పండుగ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే  హోలీ అని తెలిపారు గుర్రంపూడ్ మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు