గొర్రెలకు బ్లూటంగ్ (నీలి నాలుక) నివారణ టీకాలు పంపిణీ.
దౌల్తాబాద్, జూలై 20, జనం సాక్షి.
గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిందని, గొర్రె పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని జెడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు.అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు గొర్రెల పెంపకందారులే ఈ టీకాలను సొంత డబ్బులతో కొనుగోలు చేసి వేయించేవారని, ఈ ఏడాది మొదటిసారిగా ప్రభుత్వం ఉచితంగా నీలినాలుక వ్యాధి నివారణ టీకాలను వేయాలని నిర్ణయించడంతో మండలం లోని గొర్రెల పెంపకందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓవై పు మాంసం ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం ఉచితంగా గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ జీవాల సం పద వృద్ధికి కృషి చేస్తూ, మరోవైపు గొర్రె పిల్లలకు వచ్చే వ్యాధి నుంచి రక్షణకు సంబంధించిన టీకాలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా జీవాల వృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు.
మండల పరిధిలోని గొడుగుపల్లి, కొనాయిపల్లి, తిర్మలాపూర్ గ్రామాల్లో 1925 గొర్రెలకు నీలి నాలుక నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. పశువైద్యాధికారి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గొర్రెల సంపద పెంపునకు, గొర్రె పిల్లల రక్షణ కోసం నీలినాలుక వ్యాక్సిన్‌ను వేయించాలన్నారు. ఐదు నెలల నుంచి ఏడాది లోపు ఉన్న గొర్రె పిల్లలను కొదుమలుగా పేర్కొంటారు. వీటికి ఉచితంగా టీకాలు వేయనున్నారు.
నీలి నాలుక వ్యాధి గొర్రె పిల్లలకే వస్తుందని,ఈ వ్యాధి సోకిన గొర్రె పిల్లల్లో 106 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. పెదవులు ఎర్రబడడం, నాలుక వాపు రావడం, రంగు మారడం, నోటిలో కురుపులు, సొల్లు కార్చడం, మేత తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని. ఈ వ్యాధితో గిట్టల మధ్య ఎర్రబడి సరిగ్గా నడవలేవని. వ్యాధి తీవ్రతను బట్టి 5 నుంచి 6 రోజలు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోతాయన్నారు. ఈ వ్యాధిబారిన పడిన గొ ర్రెలకు ప్రతిరోజూ తైద, మొక్కజొన్న అంబలి తాగిస్తుండాలి. నోటిలోని పుండ్లను పొటాషియం ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్‌ను నోటిలో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, లోరాజెన్ వంటి లోషన్‌ను రాయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో
ఆయా గ్రామాల సర్పంచులు పట్నంశెట్టి శివ కుమార్,కొత్త సురేందర్ రెడ్డి, గడ్డ మీది భాగ్య ఎల్లం, ఎంపీటీసి బండారు దేవేందర్, ఉపసర్పంచ్ పడాల నగేష్
సిబ్బంది వెంకట రమణ, షకీల్ బాబా, రాజి రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది వెంకట రమణ, షకీల్ బాబా, రాజి రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.Attachments area



