గోదావరి వంతెనపై స్తంభించిన ట్రాఫిక్
భద్రాచలం: శ్రీసీతారామ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచల క్షేత్రానికి తరలించ్చారు. దీంతో గోదావరి వంతెనపై ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు రామాలయంలో ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహకులు విఫలమయ్యారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి సదుపాయం లేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఆలయంలో కల్యాణం టికెట్లు తీసుకున్నవారికి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.