గోవాలో యువరాజ్‌ పెళ్లి..!

imageభారత స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఒకసారి కాదు రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నాడు. నవంబర్ 30న ఓ పెళ్లి చేసుకోనుండగా, డిసెంబర్ 2న మరో పెళ్లి చేసుకోనున్నాడు. మూడు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిల్లా అని ఆశ్చర్యపోకండి. యువరాజ్ పెళ్లి చేసుకోబోయేది ఒక్కరినే, అదీ తన ప్రియురాలైన హాలీవుడ్ యాక్టర్ హజల్ కీచ్‌నే. ఈ నెల 30న సిక్కు సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరగనుండగా, డిసెంబర్ 2న హిందూ సంపద్రాయ ప్రకారం గోవాలలో పెళ్లి జరగనుంది. డిసెంబర్ 5న ఢిల్లీలో రిసెప్షన్ ఉంటుంది. తర్వాత ఏడో తేదీని చతర్‌పూర్‌లో మరో రిసెప్షన్ ఉంటుంది.