గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి :బీఎస్పీ నాగార్జున సాగర్ ఇంచార్జ్ ఆదిమల్ల వెంకటేష్
తిరుమలగిరి (సాగర్) ,జూలై 17 (జనం సాక్షి):
గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని
బిఎస్పీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ అన్నారు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు 12 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల కు సోమవారం బహుజన సమాజ్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ వర్కర్లు వారి ప్రాణానికి తెగించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని, వారికి ఇవ్వాల్సిన కనీస వేతనాన్ని అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిని వెట్టి చాకిరి చేయించి, వారి శ్రమను దోచుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేసి తక్షణమే గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19,500/- రూపాయలను ఇవ్వాలని , అకస్మాత్తుగా గ్రామపంచాయతీ కార్మికులు చనిపోతే వారికి ఆర్థిక భరోసా కింద వారి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి, అదే స్థానంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి ప్రజల చేతుల్లో తగిన రాజకీయ మూల్యం తప్పదని హెచ్చరించారు. బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు కార్మిక ఉద్యోగస్తులందరిని పర్మినెంట్ చేస్తామని వచ్చే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, పెద్దవూర మండల అధ్యక్షుడు కుక్క ముడి ముత్యాలు , వలికి సుధాకర్ మరియు అన్ని గ్రామాల పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.