గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షనీయం : మంత్రి జగదీష్ రెడ్డి
నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
హాజరైన ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి…
మిర్యాలగూడ, జనం సాక్షి. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త నూకల వెంకట్ రెడ్డి తనయులు ఏర్పాటుచేసిన నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, తుంగతుర్తి, భువనగిరి ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, పైళ్ల శేఖర్ రెడ్డిల తో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ
ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి రైతుబంధు సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి, రూరల్ సీఐ సత్యనారాయణ, నూకల శేఖర్ రెడ్డి, దినేష్ రెడ్డి, ప్రముఖ రైస్ మిల్లర్, బిఆర్ఎస్.జిల్లా నాయకులు వింజం రాజేందర్ ప్రసాద్, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ మద్దెల శ్రీలత, ఎంపీటీసీ ఇజ్రాయిల్, డిసీసీబీ మాజీ డైరెక్టర్ సజ్జల రవీందర్ రెడ్డి, తక్కెలపాడు సర్పంచ్ చౌగాని బిక్షం గౌడ్, ఉట్లపల్లి మాజీ సర్పంచ్ మేడ సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునచారి, జొన్నలగడ్డ రంగారెడ్డి, ఏడుకొండలు, షోయబ్, నూకలవెంకట్ రెడ్డి చారిటబుల్ హాస్పిటల్ ను మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) డిసిసి కార్యదర్శి చిలుకూరి బాలు, సందర్శించారు. డాక్టర్ బోక్రే నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.