గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం:

ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
నూతన మండల వనరుల కేంద్రం భవన ప్రారంభం
మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తిరుమలగిరి(సాగర్) సెప్టెంబర్ 28 (జనంసాక్షి):
గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
మన ఊరు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా
గురువారం మండలంలో ఎమ్మెల్యే నోముల భగత్ , ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు , శంఖు స్థాపనలు చేశారు.మండల కేంద్రంలో 31 లక్షల వ్యయంతో నిర్మించిన మండల విద్య వనరుల కేంద్రం ,ఎర్రచెరువు తండాలో 20 లక్షల వ్యాయంతో నిర్మించిన సిసి రోడ్లు ,జాల్ తండాలో 90 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన పలు అభివృద్ధి పనులకు ప్రారంబోత్సవాలు చేశారు.అదేవిధంగా1 కోటి 40లక్షలతో తిరుమలగిరి ఆర్ అండ్ బీ నుంచి శిల్గాపురం వరకు బీటి రోడ్డు వయా ఎల్ 4 కెనాల్ ,ధన్సింగ్ తండా వద్ద 1కోటి 20 లక్షల వ్యయంతో వేములవాగు బ్రిడ్జి, ధన్సింగ్ తండాలో 20 లక్షల వ్యయంతో సిసి రోడ్లు ,1కోటి 40లక్షల వ్యయంతో పిల్లిగుండ్ల తండ నుంచి చేకోలం తండా వరకు సిసి రోడ్డు ,పిల్లిగుండ్ల తండాలో 20 లక్షల వ్యయంతో సిసి రోడ్డు, చెంచువాని తండాలో 20 లక్షల వ్యయంతో సిసి రోడ్ల పనులకు శంఖుస్థాపనలు చేశారు. కార్య్రమంలో జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,ఎంఈఓ తరి రాము,మార్కెట్ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య,పాక్స్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లు చంప్లి ,స్వామినాయక్ ,బాజు శంకర్ నాయక్ ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల్, దేవస్థాన కమిటీ చైర్మన్ నాగేండ్ల వెంకట్ రెడ్డి,ఏఐబిఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షనాయక్,మండల రైతు సంఘం అధ్యక్షుడు పగడాల పెద్దిరాజు,మహిళా మండల అధ్యక్షురాలు జంగాల లక్ష్మి,ఎంపీటీసీ భార్గవి -శ్రీనివాస్ రెడ్డి,తిరుమలగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు శాగం అంజిరెడ్డి మహేశ్వరం రాంబాబు నర్సింగ్ వెంకటేష్ గౌడ్ కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.