గ్రూప్ వన్ లీకేజీలపై సిబిఐ విచారణ జరిపించాలి.

గ్రూప్ వన్ లీకేజీలపై సిబిఐ విచారణ జరిపించాలి.
బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 20. (జనంసాక్షి). తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో జరిగిన లీకేజీలపై సిబిఐ విచారణ జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై తక్షణమే సిబిఐ, సిట్టింగ్ జడ్జ్ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో బహుజన్ పార్టీ నాయకులు వరదవెల్లి స్వామి గౌడ్, అంకని భాను, లింగంపల్లి మధుకర్, హలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.