ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆవరణలో జెండాను ఆవిష్కరించి అనంతరం యువకులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్త చందు మాట్లాడుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రతి ఒక్క కార్యకర్త మరియు యువకులు సహకరించాలని దేశ రక్షణలో యువత ఎప్పుడు ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బజార్ హత్నూర్ నగర కార్యకర్తలు ఓర్ని చందు బత్తిని సాయికృష్ణ కొంగర్ల ప్రశాంత్ నాటవే గణేష్ కళ్యాణ్ వినయ్ నవీన్ కిరణ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు