ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు .

 

మల్లాపూర్ (జనం సాక్షి ) సెప్టెంబర్ 21

మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక భరతమాత కూడలి వద్ద పద్మశాలి కులస్తులు, మండల అధ్యక్షులు అయ్యోరి దశరథం, మాజీ మండల పద్మశాలి అధ్యక్షులు సిరిపురం రవీందర్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిరిపురం రవీందర్ మట్లాడుతు నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన ఒక్కరు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు.స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబార్ శంకర్, పద్మశాలి మండల ఉపాధ్యక్షులు భూస భూమేశ్వర్, ప్రధాన కార్యదర్శి పెంబి మహేందర్, పద్మశాలి మండల ప్రచార కార్యదర్శి మోర సతీష్, గూడూరు నవిన్, మార్గం రాజేశ్వర్ జక్కుల రాజేంద్రప్రసాద్, రుద్ర సురేష్, రుద్ర లక్ష్మీరాజం, తోట రాజేష్, చిప్ప లక్ష్మణ్, చిప్ప భూమయ్య, సిరిపురం వసంత్, అల్లూరి ఆదిరెడ్డి, మోరపు గంగరాజం, దొంతి సుధాకర్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.