ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…
బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి)
స్వాతంత్ర్య సమరయోధుదు, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళ వారం నాడు ఘనంగా నిర్వహించారు.బచ్చన్నపేట పొచ్చన్నపేట గ్రామపంచాయతీ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి పోచన్నపేట సర్పంచ్ గట్టు మంజుల మల్లేశం లు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు