ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

నివాళులర్పించిన ఎంపీపీ అధ్యక్షుడు మేరుగు బాలేశం గౌడ్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్
జగదేవ్ పూర్, సెప్టెంబర్ 10 (జనం సాక్షి):
తెలంగాణ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద  ఉన్న ఐలమ్మ విగ్రహానికి స్థానిక ఎంపీపీ అధ్యక్షుడు మెరుగు బాలేశం గౌడ్, మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పనగట్ల   శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు బంగ్లా శ్రీనివాస్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు,  మండల రజక సంఘం కార్యవర్గ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్  టీఆర్ఎస్ నాయకులు కొంపెల్లి కరుణాకర్ కందుల బాల్ రాజు ఆంజనేయులు బుద్ద సత్యం   హన్మంతరెడ్డి గణేష్ పల్లి సర్పంచ్ శ్రీ రాములు రజక సంఘం నాయకులు అక్కారం నర్సింలు రాచకొండ యాదగిరి జూపల్లి రాజశేఖర్ రాచమల్ల శ్రీనివాస్ వార్డుల గుండా శ్రీనివాస్  రాచకొండ బాల్ నర్సయ్య  భాస్కర్ వెంకటయ్య ఆంజనేయులు నాగరాజు మనోహర్ సీతయ్య ఏగొండ యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.న
రాజ్యాధికారం దిశగా బీసీలు అడుగులు వేయాలి
మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్
వెనుకబడిన తరగతుల  వర్గాలు  రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమళ్ల ఎల్లేష్ స్పష్టం చేశారు. శనివారం  తెలంగాణా పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రమైన జగదేవ్ పూర్ లో  స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల  వెనుకబడిన తరగతుల వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో రాజ్యాధికారం కోసం పోరాడిన ఎంతోమంది  బీసీ నాయకుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ విధానాల వల్ల  బీసీ వర్గాలకు కొంతవరకు సముచితమైన స్థానం దక్కిందని పేర్కొన్నారు. అయినప్పటికీ  సమాజంలో సగానికి ఎక్కువగా ఉన్న  వెనుకబడిన తరగతుల వర్గాలు అందరూ కులాలకు అతీతంగా ఏకమై అధికారాన్ని సాధించుకోవాలని కోరారు.
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన రజక సంఘం నాయకులు
తెలంగాణ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా జగదేవ్ పూర్ లోని స్థానిక ఎస్ వి ఫంక్షన్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన రజక వర్గానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులను రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎడపల్లి ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులు ఎడపల్లి కనకారావు రాచకొండ వినోద రాచమల్ల సరళ రాచమల్ల ప్రకాష్ లను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.