ఘనంగా చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 10, ( జనం సాక్షి ) : నియోజకవర్గకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధు రాలు, వీరనారి చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండరాజయ్య ముఖ్యఅతిథిగా హాజ రై వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమా లలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ భూమి కోసం , భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరా టస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత,తెలంగాణ సాయుధ పోరా ట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసు న్న మహారాజు కాబట్టి రజకులకు ధోభీ ఘాట్లకు , లాండ్రీ షాపులకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కేసీఆర్ కి దక్కుతుంద న్నారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయ కులు,పార్టీ ప్రతినిధులు,రజక సంఘనాయకులు , తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో తెలంగాణ రైతాంగసాయుధపోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా శనవా రం ఐలమ్మ చిత్రపటానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు పూలమాలవేసి నివా ళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలు అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్వాల కుమార్, గాదె సునీల్, బ్రహ్మం,మార్కెట్ సిబ్బంది శ్రీనివాస్, షరీఫ్, రాంచందర్, లక్ష్మీ, అశోక్, ప్రవీణ్, అనిల్, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.