ఘనంగా పొలాల పండగ.
పోటో రైటప్: బసవన్నలను పూజిస్తున్న రైతులు.
బెల్లంపల్లి, ఆగస్టు27, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలో శనివారం పొలాల అమావాస్య సందర్భంగా పొలాల పండగను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో తమకు చేదోడువాదోడు గా ఉన్న బసవన్నలను ముస్తాబు చేసి పూజించారు. అనంతరం బసవన్నలతో ఊరేగింపు నిర్వహించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. స్వంత ఎడ్లు లేని రైతులు బసవన్నల ప్రతిమలు చేసి పూజించారు.