ఘనంగా ప్రజాకవి కాళోజీ జన్మదిన వేడుకలు
జహీరాబాద్ సెప్టెంబర్ 9( జనం సాక్షి) మొగుడం పల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జన్మదిన వేడుకలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి జగదీశ్వరయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది, ఈ సందర్భంగా హెచ్ఏం పి జగదీశ్వరయ్య మాట్లాడుతూ కాళోజీ నారాయణ రావు పుట్టుక కర్ణాటక రాష్ట్రం అయినప్పటికీ వారి బాల్యం మొదలు జీవితాంతం తెలంగాణ ప్రాంతంలో గడిపి తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారని, నిజం దమన నీతికి, నిరంకుశత్వానికి , అరచకనికి పాలనకు వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తరని, అతను స్వతంత్ర సమరయోధుడని, తెలంగాణ ఉద్యమకారుడని, అతను 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందారని కొనియాడారు…