ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి.

జనం సాక్షి ఉట్నూర్.
గంగాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ విస్తృత పర్యటన ఈ పర్యటనలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు గంగాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ పనులను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గ్రామపంచాయతీలో  వర్షాకాలంలో  వచ్చే వ్యాధులపై గ్రామంలో తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామపంచాయతీలో జరిగే సానిటేషన్ వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది మరియు పల్లె ప్రగతి 1 లో  తాను గ్రామపంచాయతీ ఆవరణలో నాటిన మొక్క చాలా బాగా పెరిగిందని పెరిగిందని చూసి ఆనందించడం జరిగింది మొక్కలు బాగా పెంచుతున్నందుకు గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దుర్వా రేణుక భాయ్ శంభు, ఎంపిటిసి కోరింగరాణి , లక్కారం ఉప సర్పంచ్ కోలా సత్తన్న, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సేడ్మికి సీతారాం, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ మరియు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
 
Attachments area