ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు……
*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్……
టేకుమట్ల.సెప్టెంబర్28(జనం సాక్షి)మండలంలోని వెలిశాల గ్రామంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేణుకుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు ప్రవీణ్ కుమార్ హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, భగత్ సింగ్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ అమలు చేసి ప్రభుత్వమే అధికారికంగా భగత్ సింగ్ జయంతి,వర్ధంతి లను నిర్వహించాలని డిమాండ్ చేశారు.భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరి కోయ్యలను ముద్దాడి వీర మరణం పొందిన భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ట్యాంక్ బండ్ వద్ద భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సందీప్, రమాకాంత్,గణేష్,పవన్, దినేష్, బన్నీ,శివకుమార్,బంగారం తదితరులు పాల్గొన్నారు.