ఘనంగా మాస్టర్ మనోహర్ ని సన్మానించిన న్యాయవాదులు.
తాండూరు అగస్టు 10(జనంసాక్షి)నేటి సమాజంలో ఎంతోమంది తైక్వాండో క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత మాస్టర్ మనోహర్ కే దక్కుతుందని న్యాయవాదులు విశ్వనాధ్, రాము పేర్కొన్నారు. బుదవారo వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శివం గ్రామర్ హై స్కూల్ ఆవరణలో జాతీయ రిఫెరిగా పూర్తిచేసిన మాస్టర్ మనోహర్ తనయుడు కుశాల్, వివేక్ ప్రశంసాపత్రాలు పొందినందుకు గాను తైక్వాండో తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు,మాస్టర్ మనోహర్ ని లాయర్లు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉదయాన్నే క్రీడాకారులకు శిక్షణ ఇస్తూ.. తనదైన శైలిలో క్రీడాకారులకు మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సహంగా శిక్షణ ఇస్తూ వారి నిత్య జీవనానికి ఎంతగానో ఉపయోగపడు తుందని తెలిపారు. వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ సమాజానికి దోహదం చెస్తున్నారని గుర్తు చేశారు.నిరాడoబరంగా ఉంటూ క్రీడాకారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దు తున్నారని అన్నారు. మారుమూల ప్రాంతమైన
బషిరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన వివేక్ రాష్ట్ర, జాతీయ, జాతీయ రిఫెరిగా పూర్తిచేసి ప్రశంసాపత్రoపొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గౌతమ్, శరత్, హరిణి, శ్రీనిక , హసిమ్, హద్వెజ్ సాయి తదితరులు పాల్గొన్నారు.