ఘనంగా ముగిసిన భజన కార్యక్రమాలు
జహీరాబాద్ ఆగస్టు 27 (జనంసాక్షి)శ్రావణ మాసం సమాప్తి శ్రావణ మాసం పురస్కరించుకొని జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఆలయాల్లో శనివారం తో భజన కార్యక్రమాలు ముగియనున్న సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.హనుమాన్ మందిరంలో గత నెల రోజులుగా ప్రతిరోజూ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ మాణిక్ ప్రభు భజన మండలి,పాండురంగ భజన,శబరి మాత, బసవేశ్వర,అక్కన భలగ,మార్కండేయ,హనుమాన్ భజన మండల్లతో పాటు శ్రీరేణుక ఎల్లమ్మ మహిళ భజన మండలిలు రాత్రి మొత్తం నేడు భజన నిర్వహించి ఆలయాల సన్నిధిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు అని నిర్వహకులు తెలిపారు.




