ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని  పురస్కరించుకొని నిర్మల్ లోని  ఎన్టీఆర్ మిని స్టేడియంలో  జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా విజయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జాతీయ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి అక్షితను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా ఒలంపిక్స్ చైర్మన్ అయ్యన్న గారి భూమయ్య , జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు పాకాల రామచందర్ , తదితరులు ఉత్తమ క్రీడాకారులను సన్మానించారు.ఈ రోజు విజయ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు  అందులో భాగంగా విజయ పాఠశాల కరస్పాండెంట్  మంచిరాల నాగభూషణం , పాఠశాల ప్రిన్సిపాల్ సామ మోహన్ రెడ్డి , పాఠశాల పీఈటి  కృష్ణవేణి లు పాల్గొన్నారు.