ఘనంగా రంగుల దినోత్సవ సంబరాలు

నిర్మల్ బ్యూరో, జులై30,జనంసాక్షి,, జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ బచ్పన్ పాఠశాల లో శనివారం పసుపు పచ్చ రంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరు ఎల్లో కలర్ దుస్తులు ధరించుకొని సంబరాలు జరుపుకున్నారు.పసుపు రంగు పుష్పాలతో వివిధ చిత్రాలను రూపొందించినారు,ఆట బొమ్మల ను తయారు చేసి అలంకరించారు. ఈసందర్భంగా పాఠశాల డైరెక్టర్ అయ్యన్నగారి శ్రీధర్ పసుపు రంగు యొక్క ప్రాధాన్యత ను విద్యార్థుల కు తెలియజేశారు.అనంతరం పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అయ్యన్నగారి రచన, విద్యార్థులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.