ఘనంగా రక్షాబంధన్.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రాఖీ పౌర్ణమి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాంద్ర జైవంత్ రావు పాల్గొని రాఖీలు కట్టిన అనంతరం పిల్లలకు చాక్లెట్లు పంచారు. గ్రామ ప్రజలకు స్కూలు విద్యార్థిని విద్యార్థులకు రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాంద్ర లత పంచాయతీ కార్యదర్శి ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు ఉన్నారు.